పూసపాటి అశోక గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందిన వారు.
ఈయన విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు. ఆయన భారత ర్లమెంట్ సభ్యులు.
నరేంద్ర మోడి ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ క్యాబినెట్ మంత్రి.
వీరి తండ్రి గారు, పూసపాటి విజయరామ గజపతి రాజు, (పి.వి.జి.రాజు) గారు సింహాచలం దేవస్థానంతో సహా ఇంచుమించుగా 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు. వీరు కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ ప్యాలెస్‌తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేశారు. దీని మూలంగా మొత్తం దేశంలోని 20 సైనిక్ పాఠశాలలో మొదటిదైన కొరుకొండ సైనిక పాఠశాల ఇక్కడ ప్రారంభించబడింది. ఇలాంటి పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. వీరు తండ్రి జ్ఞాపకార్ధం మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) విద్యాసంస్థను స్థాపించి ఎంతో మందికి విద్యాదానం చేస్తున్నారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు.
ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము.
వారసత్వ ఫౌండర్ ధర్మకర్తలు
1 శ్రీ పుసపాటి విజయ రామ గజపతి రాజు గారు 1713-1757
2 శ్రీ పుసపతి ఆనంద గజపతి రాజు గారు 1758-1760
3 శ్రీ పుసపాటి విజయ రామ గజపతి రాజు గారు 1761-1794
4 శ్రీ పుసపాటి నారాయణ గజపతి రాజు గారు 1795-1845
5 శ్రీ పుసపాటి విజయ రామ గజపతి రాజు గారు 1846-1879
6 శ్రీ పుసపతి ఆనంద గజపతి రాజు గారు 1880-1897
7 శ్రీ పుసపాటి విజయ రామ గజపతి రాజు గారు 1898-1922
8 శ్రీ పుసాపతి ఆలవ్ నారాయణ గజపతి రాజు గారు 1923-1937
9 శ్రీ పూసపాటి విజయ రామ గజపతి రాజు గారు (పి.వి.జి.రాజు) 1938-1995
10 శ్రీ పుసపతి ఆనంద గజపతి రాజు గారు 1995-2016
11 శ్రీ పుసపతి అశోక్ గజపతి రాజు గారు 2016 --
In modern business it is not the crook who is to be feared most,
it is the honest man who doesn't know what he is doing ... William Wordsworth
No comments:
Post a Comment